Adikeshava | వాయిదాపడిన ఆదికేశవ

Adikeshava Release date postponed | వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆదికేశవ. వరల్డ్ కప్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు.

Advertisement
Update: 2023-11-03 00:59 GMT

ఆదికేశవ సినిమాలో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మ్యాడ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సితార సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని, ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచింది. అలాగే జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి 'సిత్తరాల సిత్రావతి', 'హే బుజ్జి బంగారం', 'లీలమ్మో' పాటలకు ఇప్పటికే ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.

'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News