Satyabhama | సత్యభామ ట్రయిలర్ లాంచ్

Satyabhama - కాజల్ లీడ్ రోల్ లో నటించిన సినిమా సత్యభామ. ఈ సినిమా ట్రయిలర్ ను బాలయ్య ఆవిష్కరించారు.

Advertisement
Update: 2024-05-24 17:35 GMT

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించాడు.

క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించిన ఈ సినిమాను.. జూన్ 7న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ రోజు నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య ప్రత్యేకంగా మాట్లాడారు.

"ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్ లో చూస్తున్నాను. సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు."

సత్యభామ ట్రయిలర్ లో కాజల్ ఫైట్స్ చేసింది. సినిమా మొత్తం తన భుజాలపై నడిపించిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.  

Full View

Tags:    
Advertisement

Similar News