Yakshini | యక్షిణి స్ట్రీమింగ్ కు రెడీ

Yakshini - వేదిక తొలిసారి తెలుగులో నటించిన వెబ్ సిరీస్ యక్షిణి. ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2024-05-24 17:40 GMT

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "యక్షిణి". ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నాడు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో "యక్షిణి" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు "యక్షిణి" వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

హీరోయిన్ వేదిక మాట్లాడుతూ - ప్రపంచ సినిమాపై గుర్తుండిపోయే బాహుబలి లాంటి ప్రాజెక్ట్ చేసిన ఆర్కా మీడియా సంస్థలో యక్షిణి వెబ్ సిరీస్ తో నేను డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. వంశీ రాసిన ఈ స్క్రిప్ట్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఆయన కొన్ని నెలల టైమ్ ఈ స్క్రిప్ట్ కోసం తీసుకుని ఉంటారు. క్యారెక్టర్స్ లో ఎంతో డెప్త్, వేరియేషన్ ఉంది. యక్షిణి మా ప్రతి ఒక్కరి కెరీర్ లో ఎంతో స్పెషల్. ప్రతి రోజూ షూటింగ్ లో ఛాలెంజింగ్ గా అనిపించేది. మా టీమ్ మెంబర్స్ అంతా తమ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను."

తెలుగులో వస్తున్న తొలి సోషియో ఫాంటసీ సిరీస్ ఇది. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణి వంద మందిని చంపితేగానీ శాపవిముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది. వందో వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరీ. 

Tags:    
Advertisement

Similar News