TV Ratings | ఆ 2 సినిమాలు అక్కడ కూడా ఫెయిల్

Mark Antony and Sundaram Master - ఈ రెండు సినిమాలు బుల్లితెరపై కూడా ఫెయిల్ అయ్యాయి.

Advertisement
Update: 2024-05-24 17:31 GMT

పెద్ద పెద్ద సినిమాలకే టీవీల్లో దిక్కు లేకుండా పోయింది. మొన్నటికిమొన్న సలార్ సినిమా అందరికీ షాకిచ్చింది. ఊహించని విధంగా చాలా తక్కువ టీఆర్పీ వచ్చింది ఈ సినిమాకి. అలాంటిది ఇక చిన్న సినిమాల సంగతి సరేసరి. అందరి అంచనాల్ని నిజం చేస్తూ, రీసెంట్ గా టీవీల్లో టెలికాస్ట్ అయిన 2 చిన్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

విశాల్ హీరోగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్, తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్. ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ తొలిసారి ప్రసారం చేసింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 0.95 టీఆర్పీ వచ్చింది. మీరు చదివింది కరెక్టే. మార్క్ ఆంటోనీ సినిమాకు కనీసం 1 టీవీఆర్ కూడా రాలేదు.

ఇక మరో సినిమా సుందరం మాస్టర్. వైవా హర్ష హీరోగా నటించిన ఈ సినిమాను రవితేజ నిర్మించాడు. తూతూ మంత్రంగా ప్రచారం చేసి థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు బుల్లితెరపై కూడా స్పందన అంతంతమాత్రం. ఈటీవీలో ఈ సినిమాను ప్రసారం చేయగా జస్ట్ 1.32 టీఆర్పీ వచ్చింది. ఇలా ఈ వారం తొలిసారి టీవీల్లోకి వచ్చిన 2 చిన్న సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. 




Tags:    
Advertisement

Similar News