Maname | శర్వానంద్ సినిమా వచ్చేస్తోంది

Sharwanand's Maname Movie - శర్వానంద్ తాజా చిత్రం మనమే. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది.

Advertisement
Update: 2024-05-24 17:38 GMT

శర్వానంద్ 35వ చిత్రం 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సమ్మర్ రేసులో చేరింది. సమ్మర్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తూ, జూన్ 7న 'మనమే' విడుదల కానుంది.

సినిమాలకు సమ్మర్ బిగ్గెస్ట్ సీజన్లలో ఒకటి. అయితే, ఈ ఏడాది సమ్మర్ లో టాలీవుడ్‌లో డీసెంట్ రిలీజులు జరగలేదు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి

టైమ్ లో జూన్ 7న మనమే సినిమా థియేటర్లలోకి వస్తుండడంతో అందరి చూపు ఈ సినిమాపై పడింది.

విడుదల తేదీ పోస్టర్ లో చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో సూట్‌లో స్మార్ట్ అండ్ మోడరన్ అవతార్‌లో శర్వానంద్‌ కనిపిస్తున్నాడు. తన ముఖం మీద ఆకర్షణీయమైన చిరునవ్వు ఉంది.

టీజర్‌లో చూపించినట్లుగా, ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి విభిన్న పాత్రలలో అలరించనున్నారు. ఇందులో విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌లు కాగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. 

Tags:    
Advertisement

Similar News