YVS Chowdhary | మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్న చౌదరి

YVS Chowdhary - ఒకప్పుడు సూపర్ హిట్ మూవీస్ అందించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా ప్రకటించాడు.

Advertisement
Update: 2024-05-23 09:21 GMT

ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. దర్శకునిగా రచయితగా నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలని అందించారు. శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి బ్లాక్ బస్టర్స్ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి నుంచి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ రాబోతుంది.

ఈ రోజు వైవిఎస్ చౌదరి పుట్టిన రోజు. అలాగే ఆయన అభిమాన దర్శకులు, దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరంలోనే ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు వైవిఎస్ చౌదరి.

ప్రతిభగల కొత్త నటీనటులతో.. న్యూ ఏజ్ యూనిక్ కంటెంట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

సలీమ్, రేయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చారు వైవీఎస్ చౌదరి. దీంతో 2015 తర్వాత మళ్లీ ఇతడి నుంచి సినిమా రాలేదు. ఈ గ్యాప్ లో ఒకట్రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. అలా కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్న చౌదరి, ఈ ఏడాది సినిమా చేస్తానంటున్నారు.

Tags:    
Advertisement

Similar News