Satyabhama | కాజల్ సినిమాకు బాలయ్య ప్రచారం

Satyabhama - కాజల్ నటించిన చిత్రం సత్యభామ. ఈ సినిమాకి బాలయ్య ప్రచారం చేయబోతున్నారు.

Advertisement
Update: 2024-05-23 09:17 GMT

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ప్రజెంటర్ గా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించాడు.

“సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. రేపు హైదరాబాద్ లో బాలకృష్ణ చేతుల మీదుగా “సత్యభామ” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

బాలకృష్ణ అతిథిగా వస్తుండటంతో “సత్యభామ” మూవీకి మరింత క్రేజ్ వచ్చింది. అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకుముందు బాలయ్య, కాజల్ కలిసి భగవంత్ కేసరి సినిమా చేశారు. ఆ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి.

సత్యభామ టీజర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. దీంతో ట్రయిలర్ తో పాటు, సినిమాపై అంచనాలు పెరిగాయి. బాలకృష్ణ రాకతో ఈ ప్రాజెక్టుకు మరింత మైలేజీ వచ్చింది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News