Chalapathi Rao: లే.. బాబాయ్.. లే..చలపతిరావు మరణంపై ఎన్టీఆర్ భావోద్వేగం

Jr NTR emotional on death of Chalapathi Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లే.. బాబాయ్.. లే అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

Advertisement
Update: 2022-12-25 06:50 GMT

Chalapathi Rao, Jr.ntr

 టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లే.. బాబాయ్.. లే అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. నటుడు చలపతిరావుకు నందమూరి హీరోలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ చలపతిరావుతో ఎంతో సన్నిహితంగా మెలిగే వారు.తాను నటించిన ఎన్నో సినిమాల్లో చలపతిరావుకు అవకాశాలు ఇప్పించారు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా చలపతిరావుతో తన అనుబంధాన్ని కొనసాగించారు.

ఇక నందమూరి హీరోల్లో మూడో తరం నటుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు చలపతిరావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో చలపతిరావు ఎన్టీఆర్ కు బాబాయ్ గా నటించారు. అప్పటినుంచి ఎన్టీఆర్ చలపతిరావుతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు. చలపతిరావు మరణ వార్త తెలియగానే ఆయన తనయుడు రవి బాబుకు ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. రవిబాబు తన తండ్రి చలపతిరావు భౌతికకాయాన్ని వీడియో కాల్ లో చూపించగానే.. ఎన్టీఆర్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు. లే.. బాబాయ్.. లే.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు.



చలపతిరావు మరణం పై ట్విట్టర్ వేదికగా కూడా ఎన్టీఆర్ స్పందించారు. ' చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబసభ్యుడిని కోల్పోయింది. తాతగారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతిరావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన.' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చలపతిరావు గారి మరణంపై నందమూరి బాలకృష్ణ, చిరంజీవి తదితర సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Tags:    
Advertisement

Similar News