దేవినేని ముందు టీడీపీ రిటైర్‌మెంట్ ప్రతిపాదన

టీడీపీని పుష్పకవిమానం అనుకుంటున్నారే ఏదో గానీ ఇతర పార్టీల నుంచి ఎంతమంది నేతలు వచ్చినా చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అవుతోంది. కాస్త పలుకుబడి ఉండి ఖాళీగా ఉన్న నేతలపై వల వేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన దేవినేని నెహ్రుపై  టీడీపీ కన్నుపడింది. దేవినేని నెహ్రును టీడీపీలో చేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఇప్పటికే ఆయనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌ గద్దె దించినప్పటి నుంచి చంద్రబాబు తీరుపై నెహ్రు ప్రతికూలంగానే ఉన్నారు. అందుకే […]

Advertisement
Update: 2016-04-02 08:49 GMT

టీడీపీని పుష్పకవిమానం అనుకుంటున్నారే ఏదో గానీ ఇతర పార్టీల నుంచి ఎంతమంది నేతలు వచ్చినా చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అవుతోంది. కాస్త పలుకుబడి ఉండి ఖాళీగా ఉన్న నేతలపై వల వేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన దేవినేని నెహ్రుపై టీడీపీ కన్నుపడింది. దేవినేని నెహ్రును టీడీపీలో చేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఇప్పటికే ఆయనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌ గద్దె దించినప్పటి నుంచి చంద్రబాబు తీరుపై నెహ్రు ప్రతికూలంగానే ఉన్నారు. అందుకే ఆయన టీడీపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు … నెహ్రు ఇంటికి వెళ్లారని వార్తలొస్తున్నాయి. గాలి… నెహ్రును టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారట. అందుకు ఆయన నిరాకరించడంతో మధ్యేమార్గంలో ముద్దుకృష్ణమ కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఎలాగో కాంగ్రెస్‌లో ఉండి సాధించేదేమీ లేదు కాబట్టి… రిటైర్‌మెంట్ ప్రకటించి .. కుమారుడు దేవినేని అవినాష్‌ను టీడీపీలోకి పంపాల్సిందిగా ప్రతిపాదించారు. ఇందుకు అవినాష్‌ కూడా సానుకూలంగానే ఉన్నారట. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. ఇంతలోనే కృష్ణాజిల్లాలో జరిగిన ఎన్టీఆర్‌ పశువైద్యశాఖ ప్రారంభోత్సవానికి అవినాష్‌ కూడా హాజరవడంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. తొలుత వైసీపీలోకి వచ్చేందుకు దేవినేని నెహ్రు ప్రయత్నించారు. అయితే వంగవీటి రాధా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ఆలోచన ముందుకు సాగలేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News