RTC లోగోలో మార్పులు.. సజ్జనార్ ఏమన్నారంటే..!

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఇటీవల TSRTCని TGS RTCగా మార్చారు అధికారులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ షార్ట్ కట్ నేమ్‌ను TSగా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Update: 2024-05-23 05:21 GMT

ప్రభుత్వ ఆదేశాలతో TS RTCని TGS RTCగా మార్చిన విషయం తెలిసిందే. అయితే RTC లోగోలో కూడా మార్పులు చేశారంటూ సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రధాన మీడియా సంస్థలు కూడా లోగోలో మార్పులు చేసినట్లు ప్రసారం చేయడం కొత్త‌ వివాదానికి దారి తీసింది. RTCలోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ తొలగించారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ వివాదంపై తాజాగా స్పందించారు TGS RTC ఎండీ సజ్జనార్. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అధికారికంగా సంస్థ ఇప్పటివరకూ కొత్త లోగోనూ రిలీజ్ చేయలేదన్నారు. TGS RTC లోగో అంటూ ప్రస్తుతం ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అన్నారు సజ్జనార్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొత్త లోగోను త్వరలోనే సంస్థ రూపొందిస్తుందన్నారు. ప్రస్తుతానికి ఇంకా లోగోను ఫైనల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.



రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఇటీవల TSRTCని TGS RTCగా మార్చారు అధికారులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ షార్ట్ కట్ నేమ్‌ను TSగా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ సర్కార్‌ TS ను TGగా మార్చాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టాయి.

Tags:    
Advertisement

Similar News