బీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య.. హుటాహుటిన కొల్లాపూర్‌కు కేటీఆర్‌

శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్‌కు బయల్దేరారు. గత ఆరు నెలల వ్యవధిలో ఇది రెండో హత్య.

Advertisement
Update: 2024-05-23 05:04 GMT

వనపర్తి జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో అర్ధరాత్రి ఈ ఘటన జరగింది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు తల నరికి చంపేశారు. శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ‌న్ రెడ్డికి ముఖ్య అనుచరుడని తెలుస్తోంది.

శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్‌కు బయల్దేరారు. గత ఆరు నెలల వ్యవధిలో ఇది రెండో హత్య. గతంలో ఇదే నియోజకవర్గం గంట్రావుపల్లి ఓ బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ‌న్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి హత్య వెనక మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని ఆరోపించారు.


నియోజకవర్గంలో ఇటీవల బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు హర్షవర్ధ‌న్ రెడ్డి. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News