'మంజుమ్మల్ బాయ్స్‌'కు షాకిచ్చిన ఇళయరాజా

కాపీ రైట్ చట్టం ప్రకారం ఈ పాటపై పూర్తి హక్కులు ఇళయరాజాకే ఉంటాయి. ఈ పాటను సినిమాలో ఉపయోగించినందుకు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement
Update: 2024-05-23 05:47 GMT

ఇటీవల విడుదలై భారీ సక్సెస్‌ సాధించిన మంజుమ్మల్ బాయ్స్‌ చిత్ర యూనిట్‌కు షాకిచ్చారు వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఇళయరాజా. మంజుమ్మల్ బాయ్స్‌ చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపించారు. సినిమాలో కీ రోల్ ప్లే చేసిన సౌబిన్ షాహిర్‌కు సైతం నోటీసులు ఇచ్చారు.

మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో తన అనుమతి లేకుండా 1991లో కమల్‌హాసన్ నటించిన గుణ సినిమాలోని కన్మణి అన్బోదు కాదలన్‌ ( తెలుగులో కమ్మని ఈ ప్రేమ లేఖనే) అనే పాటను వాడుకున్నందుకు నోటీసులు జారీ చేశారు ఇళయరాజా. కాపీ రైట్ చట్టం ప్రకారం ఈ పాటపై పూర్తి హక్కులు ఇళయరాజాకే ఉంటాయి. ఈ పాటను సినిమాలో ఉపయోగించినందుకు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మంజుమ్మల్ బాయ్స్‌ చిత్రం మంచి హిట్ సాధించింది. రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి మలయాళ ఇండస్ట్రీలోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Tags:    
Advertisement

Similar News