తోటి విద్యార్థినిపై లైంగికదాడి చేసిన టీనేజర్, ఆపై ..

ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి మార్కుల జాబితాకోసం స్కూల్ కి వచ్చిన బాలికపై తోటి విద్యార్థి లైంగిక దాడి చేసాడు.

Advertisement
Update: 2024-05-23 07:50 GMT

ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి మార్కుల జాబితాకోసం స్కూల్ కి వచ్చిన బాలికపై తోటి విద్యార్థి లైంగిక దాడి చేసాడు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఓ బాలిక ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. అయితే టీచర్లు అందుబాటులో లేకపోవటంతో వెంటనే వెనుకకు వెళ్లిపోవటానికి సిద్ధం అయ్యింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసిన మరో బాలుడు ఆమెను తరగతి గదిలోకి వెళ్ళిపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ దారుణాన్ని అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీశారు. బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేశారు. మరోవైపు డబ్బులు కావాలని తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. రెండు లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు వీడియోను వాట్సాప్ లో షేర్ చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్ కావడంతో విజయవాడ జునైల్‌ హోమ్‌కు తరలించారు. బాధితురాలిని వేధించి, వీడియో ఫార్వర్డ్ చేసిన వారిని కైకలూరు కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Tags:    
Advertisement

Similar News