ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారుల మృతి

ప్రైవేటు బస్సు బోల్తా పడగా ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగింది.

Advertisement
Update: 2024-05-23 05:15 GMT

ప్రైవేటు బస్సు బోల్తా పడగా ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఆదోనికి వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. కోడుమూరు వద్ద మరో వాహనాన్ని దాటేందుకు యత్నించగా అదుపు తప్పి బోల్తా పడింది. 

 ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన లక్షి్మ (13), గోవర్ధిని (8) అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మరో 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 

స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో డ్రైవర్‌ బస్సును అతి వేగంగా నడుపుతున్నట్టు పలువురు ప్రయాణికులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News