ఇదిగో టీడీపీ అరాచకం.. ఈసీకి కన్పించట్లేదా.!

వరుసగా బయటకు వస్తున్న వీడియోలు చూస్తుంటే మాచర్ల నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సవ్యంగా సాగలేదనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Advertisement
Update: 2024-05-23 07:53 GMT

మాచర్లలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. మాచర్ల నియోజకవర్గం తుమ్మూరు కోట గ్రామంలో టీడీపీ నేతలు పులిపాటి నాగేశ్వరరావు, ఆ పార్టీ బూత్ ఏజెంట్‌ బోయిన నరసింహ రావు పెద్ద కర్రలతో పోలింగ్‌ బూత్‌లోకి వచ్చి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోను తాజాగా వైసీపీ విడుదల చేసింది. అయితే ఈ వీడియోపై ఎలక్షన్‌ కమిషన్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.


వరుసగా బయటకు వస్తున్న వీడియోలు చూస్తుంటే మాచర్ల నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సవ్యంగా సాగలేదనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో అసలు వివాదం మొదలైంది. మాచర్లలో తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పోలీసులు పనిచేశారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకుని వారిపై దాడులు చేసిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పోలింగ్ సమయంలో వైసీపీ నేతల ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.

పూర్తిస్థాయి వీడియోలు రిలీజ్ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరించారని, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తుంది. పిన్నెల్లి ఆయన కుటుంబ సభ్యులను కూడా ఓటేయకుండా అడ్డుకున్నారని.. పోలింగ్ రోజు కారులోనే నిర్బంధించారని వైసీపీ చెప్తోంది.

Tags:    
Advertisement

Similar News