ఆర్సీబీ ఓటమికి 4 కారణాలు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. 17ఏళ్ల ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్‌లో ఓటమి ఎదురైంది.

Advertisement
Update: 2024-05-23 05:47 GMT

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. 17ఏళ్ల ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్‌లో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించింది. ఈ సాలా కప్‌ నమ్‌దే.. ఎంతో ఫేమస్‌ అయిన ఆర్సీబీ స్లోగన్ ఇది. టోర్నీ ప్రారంభమైన ప్రతీసారి ఈసారి కప్పు మనదే అనడం... తర్వాత చేతులెత్తేయడం అలవాటే. ట్రోలింగ్స్‌ పక్కనపెడితే ఆర్సీబీ అభిమానులను మెచ్చుకోవాల్సిందే. ఫలితంతో సంబంధం లేకుండా 17ఏళ్లుగా వాళ్లు తమ జట్టును ఆధరిస్తున్న తీరు అద్భుతం. ప్రతి ఏటా విరాట్‌ కోహ్లీపై, ఆర్సీబీ టీమ్‌పై ఫ్యాన్స్‌ ప్రేమ పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ లాంటి సక్సెస్‌ఫుట్‌ టీమ్‌లకు ధీటుగా ఇవాళ ఆర్సీబీ ఫాలోయింగ్‌ ఉందంటే దానికి ఏకైక కారణం అభిమానులే..

ఆర్సీబీ ఓటమికి కారణాలేంటి...?

ఇప్పుడు అందరి చర్చ ఆర్సీబీ ఓటమి గురుంచే. ఓటమికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ కారణమంటూ ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్నారు. మిగతా స్టార్ ఆటగాళ్లు కూడా ఏం తక్కువ తినలేదు. అయితే మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌ మొత్తం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. నిన్నటి మ్యాచులో డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌కి ఇది నాలుగో డకౌట్. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ నిరాశపరిచాడు. ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఓటమికి బాధ్యత మొత్తం మ్యాక్స్‌వెల్‌పైనే వేయడం కరెక్ట్ కాదు. మిగతా స్టార్ ఆటగాళ్లు కూడా ఆర్సీబీ ఓటమికి తమవంతు ప్రయత్నం చేశారు.

ఆరెంజ్‌ క్యాప్ చాలా...?

స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. కోహ్లీ ఈ మ్యాచులో 33 పరుగులు చేశాడు. కానీ.. అతను ఉన్న ఫామ్‌కు.. చేసిన పరుగులకు ఏమాత్రం సంబంధం లేదు. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. లీగ్ దశలో అదరగొట్టే కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు IPL ప్లే ఆఫ్స్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడి... కేవలం 341 పరుగులే చేశాడు. గతంలోలాగే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లీ ఈ సీజన్‌లో 15 మ్యాచులాడి 741 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గరే ఉంది. అందుకే కోహ్లీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టు కోసం ఆడాల్సిందని ఫైర్ అవుతున్నారు.

కీ ప్లేయర్లను ఎందుకు వదులుకుంటున్నారు..?

ఆర్సీబీ ఓటమికి మరో కారణం బౌలింగ్. మ్యాచ్‌ విన్నర్లు ఒక్కరూ లేరు. పేస్‌ను నమ్ముకోవడమే తప్ప బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌, కమిన్స్‌లాంటి ఇన్నోవేటివ్‌ బౌలర్లు లేరు. అందుకే 200కు పైగా స్కోర్లు చేసి కూడా ఆర్సీబీ కనీస పోటీ ఇవ్వని మ్యాచ్‌లు బోలెడున్నాయి. ఆర్సీబీ ఓటములకు మరో కారణం కీలక ఆటగాళ్లను వదులుకోవడం. ఆర్సీబీకి కీ స్పిన్నర్‌గా ఉన్న చాహల్‌ను ఈసీజన్‌లో వదిలేసుకున్నారు. ఆల్‌రౌండర్‌ శివమ్‌దూబేను మళ్లీ రీటైన్ చేసుకోలేదు. నాలుగేళ్లుగా ఇలా కీ ప్లేయర్లను ఆర్సీబీ వదులుకుంటునే వెళ్తోంది. ఇందులో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, దేవదూత్ పడిక్కల్‌ సహా చాలా మందే ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News