Pooja Hegde | ప్రేమలో పూజా హెగ్డే?

Pooja Hegde | పూజా హెగ్డేపై పెద్దగా పుకార్లు లేవు. అయితే ఈసారి మాత్రం ఆమె ప్రేమలో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement
Update: 2024-04-06 02:08 GMT

ప్రస్తుతం దేవా చిత్రంలో షాహిద్ కపూర్‌తో కలిసి పనిచేస్తున్న పూజా హెగ్డే ముంబైలో తన ప్రియుడితో కలిసి కనిపించింది. దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో ఆమె డేటింగ్ లో ఉందనేది తాజా పుకారు.

నటీనటులు ఇద్దరూ బాంద్రాలో కనిపించారు. పూజా హెగ్డే తన డేటింగ్ లైఫ్ ను ఎప్పడూ బయటపెట్టలేదు. ఓ సందర్భంగా తన ప్రేమ-పెళ్లి లాంటివి వ్యక్తిగత విషయాలని, ఎవ్వరికీ చెప్పనని కూడా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే రోహన్ మెహ్రాతో ఆమె సన్నిహితంగా ఉన్నప్పటికీ, కెమెరాకు కనిపించకుండా జాగ్రత్తపడుతోంది.

రోహన్ మెహ్రా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాడు, కానీ అంత పాపులర్ అవ్వలేదు. తండ్రిలా క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ఇక పూజాహెగ్డే విషయానికొస్తే, సల్మాన్ ఖాన్ సినిమాతో చివరిసారి బాలీవుడ్ లో కనిపించింది. త్వరలోనే షాహిద్ కపూర్ తో కలిసి దేవా అనే సినిమాలో కనిపించనుంది.

ఓవైపు ఈ సినిమా షూట్ లో పాల్గొంటూనే, మరోవైపు రోహన్ మెహ్రాతో ఆమె డేటింగ్ సాగిస్తోంది. ఇలా ముంబయిలో డేటింగ్ సాగిస్తూనే, మరోవైపు సౌత్ లో సినీ అవకాశాల కోసం ఆమె గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నాగచైతన్య సరసన ఆమె మరోసారి నటించే అవకాశం ఉంది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

Tags:    
Advertisement

Similar News