బన్నీ సినిమా వాయిదా గ్యారెంటీ

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాను తన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో పవన్ కల్యాణ్ కూడా అదే రోజును తన కొత్త సినిమా విడుదలకు ఎంచుకున్నాడు. దీంతో బన్నీ-పవన్ మధ్య పోటీ తప్పదని అంతా భావించారు. అయితే విషయాన్ని అంతవరకు రానివ్వకుండా ముందుగానే బన్నీసడైపోయినట్టు సమాచారం. తన పుట్టినరోజుకు పవన్ సినిమా విడుదలకావడాన్ని గొప్పగా భావించిన బన్నీ…. సరైనోడు మూవీని రేసు […]

Advertisement
Update: 2016-01-29 23:22 GMT
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాను తన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో పవన్ కల్యాణ్ కూడా అదే రోజును తన కొత్త సినిమా విడుదలకు ఎంచుకున్నాడు. దీంతో బన్నీ-పవన్ మధ్య పోటీ తప్పదని అంతా భావించారు. అయితే విషయాన్ని అంతవరకు రానివ్వకుండా ముందుగానే బన్నీసడైపోయినట్టు సమాచారం. తన పుట్టినరోజుకు పవన్ సినిమా విడుదలకావడాన్ని గొప్పగా భావించిన బన్నీ…. సరైనోడు మూవీని రేసు నుంచి తప్పించాడు. కుదిరితే తన పుట్టినరోజు కంటే కాస్త ముందుగానైనా… లేక… సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన తర్వాతైనా తన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. నిజానికి ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ రాకుండా చేసింది చిరంజీవి అనే అంటున్నారు. ఈమధ్య జరిగిన పవన్-చిరు భేటీలో ఈ అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. పవన్ ప్రతిపాదన మేరకు…. నిర్మాత అల్లు అరవింద్… తన కొడుకు సినిమాను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. సరైనోడు సినిమాకు అల్లు అరవిందే నిర్మాత.
Tags:    
Advertisement

Similar News