Love Mouli | తమ కష్టాలపై సినిమా తీయొచ్చంటున్న నవదీప్

Love Mouli Movie - లవ్ మౌళి సినిమా తన కెరీర్ ను మార్చేస్తుందంటున్నాడు నవదీప్. ఈ సినిమా కోసం అంతా చాలా కష్టపడ్డామని చెబుతున్నాడు.

Advertisement
Update: 2024-05-26 17:38 GMT

నవదీప్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. అతడి తాజా చిత్రం లవ్ మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు.

ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు 'ఏ' సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది యూనిట్. ఈ సంద‌ర్భంగా నవదీప్ మీడియాతో మాట్లాడాడు. ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టాలతో ఓ సినిమా తీయొచ్చని అంటున్నాడు.

"ఈ క‌థ విన్న‌ప్పుడే మేఘాలయంలో షూటింగ్ చేయాల‌ని అనిపించింది. ఎన్నో వ్య‌య ప్ర‌య‌సాల‌తో చిత్రీక‌ర‌ణ చేశాం. ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ ఎలా జ‌రిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామ‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఇక సినిమా ఫ‌లితం ఆడియ‌న్స్ చేతిలో ఉంది." అంటూ స్పందించాడు నవదీప్.

తన వ్యక్తిగత జీవితంలో ఎఫైర్లు, ప్రేమకథలకు సంబంధించిన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని ప్రకటించాడు నవదీప్. 

Tags:    
Advertisement

Similar News