Bharateeyudu | భారతీయుడు రీ-రిలీజ్

Bharateeyudu - భారతీయుడు-2 ప్రమోషన్స్ లో భాగంగా 1996 నాటి భారతీయుడు చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement
Update: 2024-05-26 17:46 GMT

భారతీయుడు-2 విడుదలకు సిద్ధమౌతోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా విడుదలైంది. జులై 12న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచారం కోసం ఏ చిన్న అవకాశాన్ని మేకర్స్ విడిచిపెట్టడం లేదు. ఇందులో భాగంగా భారతీయుడు చిత్రాన్ని మరోసారి విడుదల చేయబోతున్నారు.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చింది భారతీయుడు సినిమా. అప్పట్లో ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. మళ్లీ ఇన్నేళ్లకు భారతీయుడు సినిమాకు సీక్వెల్ రెడీ చేశారు ఈ ఇద్దరు. దీంతో సీక్వెల్ కు మరించ ప్రచారం కల్పించేందుకు, అప్పటి భారతీయుడు సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న హైప్ ప్రకారం చూసుకుంటే.. ఈ రీ-రిలీజ్ బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ఈ మెగా ప్రాజెక్ట్‌ని తన 'శ్రీ సూర్య మూవీస్' బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు.

భారతీయుడు-1 జూన్ 7ను రీ-రిలీజ్ అవుతోంది. కమల్ హాసన్, మనీషా కొయిరాలా, ఊర్మిళ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అప్పట్లో సంగీతం పెద్ద హైలెట్ గా నిలిచింది. అప్పటి సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తే, సీక్వెల్ కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News