Gangs Of Godavari | తన పాత్రపై స్పందించిన అంజలి

Gangs Of Godavari - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తన పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై స్పందించింది హీరోయిన్ అంజలి.

Advertisement
Update: 2024-05-26 17:41 GMT

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు.

ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన అంజలి, సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని వివరించింది.

"ఈ తరహా పాత్రలు నిజజీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను."

ఇలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తన పాత్ర గురించి బయటపెట్టింది అంజలి. సినిమాలో తన పాత్ర, విశ్వక్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని.. సినిమాలో విశ్వక్ ఎంత గట్టిగా మాట్లాడతారో.. అంతకంటే గట్టిగా తను మాట్లాడతానని తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News