Music Shop Murty | మరో సినిమా వాయిదా

Music Shop Murty - అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.

Advertisement
Update: 2024-05-26 17:36 GMT

టాలీవుడ్ లో సినిమాలు వాయిదాలు పడడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సినిమా చేరింది. దాని పేరు మ్యూజిక్ షాపు మూర్తి. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు.

శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు రిలీజయ్యాయి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. లెక్కప్రకారం ఈ సినిమా 31వ తేదీన విడుదల కావాలి. కానీ జూన్ 14కు వాయిదా వేశారు.

ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మేకర్స్.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. 

Tags:    
Advertisement

Similar News