Karthi | సూర్య నిర్మాత.. కార్తి హీరో

Karthi - కార్తి కొత్త సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు సూర్య నిర్మాత.

Advertisement
Update: 2024-05-25 17:59 GMT

హీరో కార్తీ కోసం, అతడి అన్నయ్య సూర్య నిర్మాతగా మారాడు. సూర్య భార్య జ్యోతిక సహ-నిర్మాతగా మారింది. ’96’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూర్య నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా 'మెయ్యళగన్' పేరుతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపించారు. అరవింద్ స్వామి సైకిల్ తొక్కుతుంటే, కార్తీ వెనుక కూర్చుని చిన్నపిల్లాడిలా పోజు ఇవ్వడం ఆకట్టుకుంది.

తెలుగు తమిళ ద్విభాష చిత్రంగా రూపొందుతన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

’96’ చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోవింద్ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News