ఇప్పటికి గ్రాండ్ ప్రిక్స్ కొట్టిన ఇండియా!

ఇది చరిత్రాత్మక ఘట్టం. ఎదురు చూడని విశిష్ట గౌరవం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎట్టకేలకు ఇండియా చరిత్ర సృష్టించింది. కేన్స్ లో అత్యున్నత పామ్ డి ఓర్ అవార్డు తర్వాత రెండవ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘గ్రాండ్ ప్రిక్స్’ ని ఇండియా హస్తగతం చేసుకుంది. దీన్ని సాధించిన మొదటి భారతీయ దర్శకురాలిగా పాయల్ కపాడియా నిలిచింది.

Advertisement
Update: 2024-05-26 08:04 GMT

ఇది చరిత్రాత్మక ఘట్టం. ఎదురు చూడని విశిష్ట గౌరవం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎట్టకేలకు ఇండియా చరిత్ర సృష్టించింది. కేన్స్ లో అత్యున్నత పామ్ డి ఓర్ అవార్డు తర్వాత రెండవ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘గ్రాండ్ ప్రిక్స్’ ని ఇండియా హస్తగతం చేసుకుంది. దీన్ని సాధించిన మొదటి భారతీయ దర్శకురాలిగా పాయల్ కపాడియా నిలిచింది. కేన్స్ లో శనివారం రాత్రి ఈ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చలన చిత్రానికి గాను ఈ పురస్కారం దక్కింది. మే 17-25 మధ్య జరిగిన కేన్స్ 77వ ఎడిషన్ కి ఇటీవలి హాలీవుడ్ సూపర్ హిట్ ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించారు.

సమకాలీన ముంబాయిలో నివసిస్తున్న ఇద్దరు కేరళ నర్సుల కథతో రూపొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ 30 ఏళ్ళలో కేన్స్ లో ప్రధాన పోటీలో పాల్గొన్న మొదటి భారతీయ చలన చిత్రం కావడం విశేషం. ఇందులో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్ నటించారు. అయితే ఈ సందర్భంగా అమెరికన్ దర్శకుడు సీన్ బేకర్ నిర్మించిన ‘అనోరా’ కేన్స్ లో అత్యున్నత బహుమతి పామ్ డి ఓర్‌ ని గెలుచుకుంది. ఈ పోటీలో ‘గాడ్ ఫాదర్’ ప్రసిద్ధ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా నిర్మించిన ‘మెగాపొలిస్’, యోర్గోస్ లాంటిమోస్ ‘కైండ్‌నెస్’, ఆండ్రియా ఆర్నాల్డ్ ‘బర్డ్’ , జియా జాంగ్ ‘క్యాచ్ బై ది టైడ్స్’ మొదలైనవి పాల్గొన్నాయి.

ఎప్పుడో 1946 లో అత్యున్నత పామ్ డి ఓర్‌ అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చలన చిత్రంగా చేతన్ ఆనంద్ దర్శకత్వంలో ‘నీచా నగర్’ గౌరవం పొందింది. తర్వాత మృణాల్ సేన్ దర్శకత్వంలో ‘ఖరీజ్’ 1983లో జ్యూరీ ప్రైజ్ గెలుచుకుంది. 1994లో, మలయాళ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన క్లాసిక్ ‘స్వాహం’ పామ్ డి ఓర్ కోసం పోటీ పడిన చివరి చలన చిత్రంగా నమోదైంది.

పాయల్ కపాడియా పుణె ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి. ఆమె ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్‌’ తోనే బాగా ప్రసిద్ది చెందింది. ఇది 2021 కేన్స్ ఫిలింఫెస్టివల్ డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ సైడ్-బార్‌లో ప్రదర్శన పొంది, ఒయిల్ డి ఓర్ (గోల్డెన్ ఐ) అవార్డు గెలుచుకుంది.

పోతే, ఈ సారి ఇండియాకి కేన్స్ లో మంచి రోజులే ఎదురయ్యాయి. పాయల్ కపాడియాకి ముందు రోజు అనసూయ అవార్డు సాధించింది. బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బోజనోవ్ రూపొందించిన ‘షేమ్‌లెస్’ చలన చిత్రం అన్ సెర్టైన్ రిగార్డ్ కేటగిరీలో పోటీపడి, అనసూయ సేన్‌గుప్తాకి ఉత్తమ నటి అవార్డుని అందించింది. లా సినీఫ్ విభాగంలో, చిదానంద ఎస్ నాయక్ ‘సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ టు నో’, బ్రిటన్ కి చెందిన మాన్సీ మహేశ్వరి ‘బన్నీహుడ్’ వరుసగా మొదటి, తృతీయ బహుమతుల్ని పొందాయి. ఛాయాగ్రహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీలో ప్రతిష్టాత్మకమైన Pierre Angénieux ExcelLens అవార్డుని అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుని గెలుచుకున్న మొదటి ఆసియా వ్యక్తి త కాగా, కేన్స్ లో పాయల్ కాపాడియాతో బాటు అనసూయా సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. కేన్స్ లో ఉత్తమ నటి అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది. చ ‘ది షేమ్‌లెస్‌’ ఆమె సెక్స్‌ వర్కర్‌ పాత్ర పోషించింది. ఢిల్లీ వేశ్యా గృహంలో పోలీసుని చంపి పారిపోయే కథ. దీన్ని భారత్‌, నేపాల్‌లలో నెలన్నర రోజులపాటు చిత్రీకరించారు. విశేషమేమిటంటే, నటిగా తను వెండితెరకి పరిచయమైన తొలి చలన చిత్రం ‘షేమ్ లెస్’ తోనే ఉత్తమ నటి అవార్డు నందుకోవడం! 


Full View


Tags:    
Advertisement

Similar News