Keerthy Suresh | మరో బయోపిక్ లో కీర్తిసురేష్

Keerthy Suresh - హీరోయిన్ కీర్తి సురేష్ మరో బయోపిక్ లో కనిపించబోతోంది. ఈసారి ఇది మరింత ప్రతిష్టాత్మకం.

Advertisement
Update: 2024-05-25 18:02 GMT

"మహానటి" బయోపిక్‌లో దివంగత సావిత్రి పాత్రలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది కీర్తి సురేష్. నటిగా ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఏకంగా జాతీయ అవార్డ్ దక్కించుంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కీర్తిసురేష్. మహేష్ బాబు సరసన సర్కారువారి పాట సినిమా కూడా చేసింది.

అయితే ఆమె కెరీర్ లో బెస్ట్ మూవీ మాత్రం మహానటి. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో బయోపిక్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో కీర్తిసురేష్ నటించనుంది. ఈ మేరకు ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నిజానికి ఈ బయోపిక్ కోసం నయనతార, త్రిష లాంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరికి కీర్తిసురేష్ అయితే బాగుంటుందని నిర్ణయానికొచ్చారు. ఈ బయోపిక్ లో కీర్తిసురేష్ నటిస్తే, ఆమె కెరీర్ లో మరో ఆణిముత్యం చేరినట్టే. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇంకా చర్చలు సాగుతున్నాయి.

మరోవైపు కీర్తిసురేష్ కల్కి సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సినిమా నుంచి బుజ్జి అనే కారును ఆవిష్కరించారు. ఈ కారుకు అమర్చిన బ్రెయిన్ కు వాయిస్ ఓవర్ ఇచ్చింది కీర్తి. సినిమా మొత్తం కీర్తిసురేష్ వాయిస్ వినిపిస్తుందంట. కాకపోతే ఆమె కనిపించదు.

Tags:    
Advertisement

Similar News