పవన్ కి కోపం వచ్చింది.. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

తనకి జ్వరం ఉన్నా ప్రజలకోసమే బయటకు వచ్చానన్నారు పవన్ కల్యాణ్. 20 రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా... ప్రజల భవిష్యత్ కోసమే తాను బయటకొచ్చానన్నారు.

Advertisement
Update: 2024-04-22 02:55 GMT

జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోయారు..

భార్యల్ని మార్చినట్టు నియోజకవర్గాలు మార్చేస్తున్నారు.

పవన్ సినిమా హీరో, వంగా గీత లోకల్ హీరో..

అంటూ ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ బాగా ఫీలయినట్టున్నారు. అందుకే ఈసారి పవన్ కూడా మరింత ఘాటుగా బదులిచ్చారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే వ్యక్తులు మూర్ఖులంటూ మండిపడ్డారు.

"జగన్‌..! నేను భీమవరం నుంచి పారిపోవడం కాదు. మీరే హామీల నుంచి పారిపోయారు. కోడికత్తితో పొడిస్తే అరిచినట్లు అవ్వలూ.. అమ్మలూ.. అక్కలూ అని దీర్ఘాలుతీస్తూ హామీలిచ్చారు. కరెంటు బిల్లుల వంకతో వేలమందికి పింఛన్లు తొలగించారు. మళ్లీ గెలిస్తే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు. డిజిటలీకరణ చేసి ప్రజల ఆస్తులు దోచేస్తారు. ఆలోచించి ఓటేయండి." అంటూ బదులిచ్చారు పవన్. జగన్ లాగా తాను మూడోతరం నాయకుడిని కాదని, కష్టపడి, కిందనుంచి పైకొచ్చిన నాయకుడినని అన్నారు.

జ్వరంతో ఉన్నా మీకోసం..

తనకి జ్వరం ఉన్నా ప్రజలకోసమే బయటకు వచ్చానన్నారు పవన్ కల్యాణ్. 20 రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా... ప్రజల భవిష్యత్ కోసమే తాను బయటకొచ్చానన్నారు. తన ఆరోగ్యంపై కూడా ముఖ్యమంత్రి సెటైర్లు వేస్తున్నారని చెప్పారు.

ఊగిపోవడం.. ఆగిపోవడం..

రెండు రోజులపాటు ప్రసంగాలతో ఊగిపోవడం, ఆ తర్వాత జ్వరంతో ఆగిపోవడం.. పవన్ కి అలవాటేనంటున్నారు నెటిజన్లు. జ్వరం వస్తే చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాతే రావొచ్చు కదా అంటున్నారు. పోనీ జ్వరంతో బాధపడుతున్నా కూడా జనంలోకి వచ్చిన పవన్ చేస్తున్నదేంటి..? జగన్ పై తనకున్న అక్కసుని వెళ్లగక్కడమే కదా అని విమర్శిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News