మరచిపోయా.. వారికి స్పెషల్ థ్యాంక్స్

నటుడు షకలక శంకర్ కామెంట్లు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పేరు పేరునా కొంతమందిని గుర్తు పెట్టుకుని మరీ ట్వీట్లు వేయడం విశేషం.

Advertisement
Update: 2024-05-25 04:36 GMT

ఈనెల 13న ఏపీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులు రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆయన ధన్యవాదాల ప్రకటనలు ఆసక్తిగా మారాయి. అప్పుడు మరచిపోయా, ఇప్పుడు గుర్తొచ్చారంటూ.. మరికొందరికి థ్యాంక్స్ చెబుతూ ఆయన ప్రకటనలు విడుదల చేస్తున్నారు.


అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుల రవణం స్వామి నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్. తనకోసం ఆయన పిఠాపురం వచ్చారని, జనసేన పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారని చెప్పారు పవన్. అందుకే ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నట్టు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన డీకే ఆదికేశవులు మనవరాలు, డీకే చైతన్య కూడా తనకోసం పిఠాపురం వచ్చి నెలరోజులపాటు ప్రచారం చేశారంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు పవన్. ఇక జనసేన వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారాయన.

నటుడు షకలక శంకర్ కామెంట్లు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జనసేన కోసం ప్రచారం చేసినా తనకు కనీసం గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పేరు పేరునా కొంతమందిని గుర్తు పెట్టుకుని మరీ ట్వీట్లు వేయడం విశేషం. ముఖ్యంగా చిరంజీవి యువత నాయకులకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు, ఫలితాలు విడుదలయ్యే లోపు ఇంకెంతమందికి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News