నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు యువకుల మృతి

నంద్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Update: 2024-05-25 02:41 GMT

నంద్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా డోన్‌ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

యువకులు ముగ్గురూ జోరు వర్షంలో బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను డోన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతిచెందినవారిలో ముని, ప్రభాకర్‌ తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరో యువకుడు దశరథ డోన్‌ మండలం చనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్‌ పని నిమిత్తం డోన్‌కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News