ఆయనే సూత్రధారి.. త్రిపాఠి బదిలీకోసం వైసీపీ పట్టు

టీడీపీ కూటమి ఏరికోరి బదిలీపై తెచ్చుకున్న త్రిపాఠి స్వామిభక్తి చూపించారు. పల్నాడులో అల్లర్లకు ఆయన సహకరించారని వైసీపీ ఆరోపిస్తోంది.

Advertisement
Update: 2024-05-24 05:29 GMT

పల్నాడులో జరిగిన ఎన్నికల హింసకు ప్రధాన సూత్రధారిగా ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు వినపడుతున్నాయి. వైసీపీ నేతలు ప్రధానంగా ఆయనపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కౌంటింగ్ సమయానికైనా ఆయన్ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపాఠి, టీడీపీ సేవలో తరించినందువల్లే గొడవలు పెరిగాయని, కనీసం ఆయన తమ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు వైసీపీ నేతలు.


ఎన్నికల టైమ్ లో..

ఎన్నికలకు ముందు ఏపీలో పోలీస్ అధికారుల్ని బదిలీ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో గుంటూరు డీఐజీ, పల్నాడు ఎస్పీ పేర్లు కూడా ఉన్నాయి. వెంటనే వారిద్దర్నీ బదిలీ చేసిన ఈసీ ఆయా స్థానాల్లో టీడీపీ అనుకూల అధికారుల్ని నియమించిందనే ఆరోపణలు వినిపించాయి. అలా గుంటూరు ఐజీగా వచ్చారు సర్వశ్రేష్ట త్రిపాఠి. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి ఆయన అత్యంత సన్నిహితుడని పేరుంది. అంటే చంద్రబాబుకి కూడా ఆయన నమ్మిన బంటు అని వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా టీడీపీ కూటమి ఏరికోరి బదిలీపై తెచ్చుకున్న త్రిపాఠి స్వామిభక్తి చూపించారు. పల్నాడులో అల్లర్లకు ఆయన సహకరించారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఎమ్మెల్యే పిన్నెల్లి స్వగ్రామంలో కూడా టీడీపీకి అనుకూలంగా పోలింగ్ జరిగేలా త్రిపాఠి వ్యవహరించారని, పోలింగ్ ఏజెంట్లను కూడా ఆయనే నియమించారని సమాచారం. ఎస్పీ కూడా ఆయా గ్రామాల్లో తిష్టవేసి, టీడీపీకి అడ్డులేకుండా చూశారని వైసీపీ విమర్శిస్తోంది. రేపు కౌంటింగ్ రోజు మరిన్ని అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసిందని, ఐజీ త్రిపాఠిని బదిలీ చేయకపోతే ఆ ప్లాన్ యధావిధిగా అమలవుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్రిపాఠి బదిలీకి డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News