రేవ్ పార్టీతో లోకేష్ కి సంబంధం..? మోత మోగిపోతున్న సోషల్ మీడియా

బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈరోజు వరకు నటి హేమ ఈ రేవ్ పార్టీ ఎపిసోడ్ లో హైలైట్ కాగా, ఇప్పుడు టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారు.

Advertisement
Update: 2024-05-24 10:14 GMT

పల్నాడు ఎన్నికల గొడవలకంటే.. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియాలో సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా రేవ్ పార్టీ సంబంధిత వార్తలే హైలైట్ అవుతున్నాయి. మంత్రి కాకాణి కూడా రేవ్ పార్టీ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రేవ్ పార్టీతో టీడీపీకి సంబంధం ఉందంటూ తాజాగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.


బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు నారా లోకేష్ అనుచరులేనంటూ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిళ్లు కొన్ని ఫొటోలను కూడా తెరపైకి తెచ్చాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వారిలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు ఉన్నారని, వారిద్దరూ బెంగళూరు టీడీపీ ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులని అంటున్నారు. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి సత్సంబంధాలున్నాయని చెబుతున్నారు. ఆధారాలివిగో అంటూ నారా లోకేష్ సహా టీడీపీ నేతలతో వారు దిగిన ఫొటోలను చూపిస్తున్నారు.

మొత్తమ్మీద బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈరోజు వరకు నటి హేమ ఈ రేవ్ పార్టీ ఎపిసోడ్ లో హైలైట్ కాగా, ఇప్పుడు టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారు. నారా లోకేష్ కి సంబంధించిన వారు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News