అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కేసులో మరో ట్విస్ట్

స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించారు. ఈ ఘటన జరిగి రెండు వారాలవుతుండగా.. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడటం విశేషం.

Advertisement
Update: 2024-05-25 03:32 GMT

ఎన్నికల ముందు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు అలసత్వం వహించారంటూ ఇద్దరు సిబ్బందిపై ఈసీ చర్యలు తీసుకుంది. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించారు. ఈ ఘటన జరిగి రెండు వారాలవుతుండగా.. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడటం విశేషం.

అధికారులకు నోటీసులు..

ఇదే సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ భారీగా జన సమీకరణ జరగడంపై ఈసీ సీరియస్ అయింది. అప్పటికప్పుడు అల్లు అర్జున్, శిల్పారవిపై పోలీసులు కేసులు పెట్టినా, ఈసీ మాత్రం పోలీస్ అధికారులకు నోటీసులిచ్చి, ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసేలా ఉత్తర్వులిచ్చింది.

కుటుంబంలో కూడా..

ఇక అల్లు అర్జున్ నంద్యాల పర్యటన మెగా ఫ్యామిలీలో కూడా చిచ్చు రేపింది. బన్నీపై నాగబాబు వేసిన ట్వీట్ కలకలంరేపగా ఆయన కొన్నిరోజులు ట్విట్టర్ కి కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్టే కనపడుతున్నాయి. కానీ బన్నీ వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలపడంతో పవన్ కల్యాణ్ అభిమానులకు, బన్నీ అభిమానులకు సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. 

Tags:    
Advertisement

Similar News