Saindhav Movie: ఇవాళ్టి నుంచి వెంకీ సినిమా రెగ్యులర్ షూటింగ్

Venkatesh's Saindhav Movie: వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ మూవీ రెగ్యులర్ షూట్ మొదలైంది.

Advertisement
Update: 2023-03-23 14:51 GMT

Saindhav Movie: ఇవాళ్టి నుంచి వెంకీ సినిమా రెగ్యులర్ షూటింగ్

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌ డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అప్ డేట్ ప్రకారం, ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదే ఈ సినిమాకు ఫస్ట్ షెడ్యూల్.

సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌ లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా అంతే ఎగ్రెసివ్ లుక్ లో కనిపించారు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్ లోనే కాస్ట్ లీ మూవీ ఇది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నాడు. అతడిది చాలా కీలకమైన పాత్ర.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. వెంకీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ విడుదలకానుంది.

Tags:    
Advertisement

Similar News