Salaar 2 | క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీమ్

Salaar 2 - సలార్-2పై చాలా పుకార్లు చెలరేగుతున్నాయి. వీటన్నింటిపై టీం క్లారిటీ ఇచ్చింది.

Advertisement
Update: 2024-05-06 17:43 GMT

సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్, వెంటనే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడని పుకార్లు వచ్చాయి. దీంతో సలార్ 2 వాయిదాపై పుకార్లు మొదలయ్యాయి. వీటిని ప్రభాస్ టీమ్ ఖండించింది.

ప్రశాంత్ నీల్‌తో తన సినిమాని ఆయన పుట్టినరోజున ప్రకటిస్తారని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన పాన్ ఇండియా చిత్రం దేవర పనిలో బిజీగా ఉన్నాడు, అది కూడా చివరి దశలో ఉంది. అతను హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2తో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు. దాంతో ఎన్టీఆర్ తన సినిమాని ప్రశాంత్ నీల్ తో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే సలార్ 2 షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా సెట్స్ పైకి వస్తున్నాడు. ఈ సినిమా తొలి భాగం అన్ని పార్టీలకు లాభం తెచ్చిపెట్టలేదు. కొంతమంది నష్టాలు చూశారు. అటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా 5 వారాలు మాత్రమే ట్రెండింగ్‌లో ఉండటంతో ఓటీటీ స్పందన కూడా యావరేజ్ గా మారింది.

ఇక ఇటీవల టీవీ ప్రీమియర్ లో కూడా ఘోరంగా ఫెయిలైంది. ఇలాంటి టైమ్ లో పార్ట్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సమయం తీసుకుంటే, సినిమాపై ప్రజల్లో ఉన్న ఆసక్తి, అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే సలార్-2 ను వెంటనే స్టార్ట్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News