Prathinidhi 2 | నారా రోహిత్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Prathinidhi 2 - నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి-2. ఈ సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.

Advertisement
Update: 2024-05-05 16:02 GMT

హీరో నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ 'ప్రతినిధి 2' వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు కలసిరాబోతున్నాయి.

ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సాంగ్స్ కూడా రిలీజయ్యాయి కానీ వాటికి కూడా ఏమంత రెస్పాన్స్ రాలేదు.

ప్రతినిధి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు నారా రోహిత్. సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రతినిధి-2 సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు నారా రోహిత్. ఎందుకంటే, అతడికిది కమ్ బ్యాక్ మూవీ. 

Tags:    
Advertisement

Similar News