NTR | ఎన్టీఆర్ పుట్టినరోజున 3 అప్ డేట్స్

NTR's Birthday - ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఏకంగా 3 అప్ డేట్స్ రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..

Advertisement
Update: 2024-05-05 16:06 GMT

మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఈ పుట్టినరోజు కోసం అతడి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 3 సినిమాలు ఉండడమే. వీటి అప్ డేట్స్ వస్తాయనేది వాళ్ల ఆశ.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. పుట్టినరోజు కానుకగా మరో వీడియో వచ్చే అవకాశం ఉంది. దీనికి యూనిట్ ప్రస్తుతానికైతే ప్రకటన చేయలేదు కానీ, కచ్చితంగా ఆశ్చర్యకరమైన వీడియోనే విడుదల చేస్తారు.

ఇక దేవరతో పాటు, బాలీవుడ్ లో వార్-2 చేస్తున్నాడు ఎన్టీఆర్. తారక్ కు తొలి స్ట్రయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే అతడి పుట్టినరోజు నాడు స్పెషల్ లుక్ తో ఏదైనా పోస్టర్ రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. హృతిక్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్, కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాలతో పాటు.. ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రావాల్సిన ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News