Indian 2 | భారతీయుడు-2 విడుదల తేదీ ఫిక్స్ అయిందా?

Bharateeyudu 2 - కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాకు మరో విడుదల తేదీ లాక్ చేశారు

Advertisement
Update: 2024-05-06 17:40 GMT

తెలుగులో భారతీయుడు-2 అనే టైటిల్ తో వస్తోంది ఇండియన్ 2. ఈ ఏడాది అతిపెద్ద ఇండియన్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడుకు సీక్వెల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు శంకర్ దర్శకుడు. మొదటి భాగంలో 'సేనాపతి'గా కనిపించిన కమల్ హాసన్, అదే పాత్రను తిరిగి ఇందులో పోషిస్తున్నారు.

ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం, ఆలస్యం అవ్వడం, షెడ్యూల్స్ మారిపోవడం లాంటివి జరిగాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ, ఈ సినిమాను జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే అక్కడ కూడా అడ్డంకి పడింది. సినిమా వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం, అలా వాయిదా పడిన ఇండియన్-2 సినిమాను జూలై 17న విడుదల చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.

అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్నాడు. ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్ నటించాడు.

Tags:    
Advertisement

Similar News