Ranveer Singh | రణ్వీర్-ప్రశాంత్ సినిమా

Ranveer Singh - హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు రణ్వీర్ సింగ్. ఈ సినిమాపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి

Advertisement
Update: 2024-05-06 17:23 GMT

హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవ్వడంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారాడు. అతడికి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. హనుమాన్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మకు ఏకంగా 3 సినిమా ఆఫర్లు వచ్చాయి.

అయితే అతడు జై హనుమాన్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ప్రాజెక్టు చేస్తున్న ప్రశాంత్ వర్మ.. డీవీవీ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అధీర సినిమా చేస్తున్నాడు. ఇప్పుడీ దర్శకుడు మరో సినిమాకు కమిట్ అయ్యాడు. బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.

హనుమాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. తను తీయబోయే ప్రతి సినిమాకు హనుమాన్ ను లింక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సో.. రణ్వీర్ సింగ్ తో కూడా అతడు ఏదో పెద్ద కథనే ఎంచుకునే అవకాశం ఉంది. రణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన తాజా సమాచారం ఇంటర్నెట్‌లో లీక్ అయింది. దాని ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కి 'రాక్షస్' అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతిత్వరలో వెలువడనుంది.

ప్రస్తుతం ఈ దర్శకుడు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని తన టీమ్ కు అప్పగించాడు. అధిరా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ వెంటనే రణ్వీర్ సినిమా కూడా స్టార్ట్ చేస్తాడు. ఇలా రాబోయే మూడేళ్ల పాటు, 3 సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు ఈ పాన్ ఇండియా డైరక్టర్. 

Tags:    
Advertisement

Similar News