Vaishnavi Chaitanya | రియల్ లైఫ్ లో కూడా హ్యాండిస్తానంటున్న 'బేబి'

Vaishnavi Chaitanya - బేబి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. ఇప్పుడీ హీరోయిన్ తన పెళ్లిపై స్పందించింది.

Advertisement
Update: 2023-08-30 17:38 GMT

ఈమధ్య కాలంలో సూపర్ హిట్టయిన సినిమాల్లో ఒకటి బేబి. ఈ సినిమా క్లయిమాక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎటూ తేల్చుకోలేని హీరోయిన్, తన ఇద్దరు లవర్స్ ను వదిలేసి, మూడో వ్యక్తితో సెటిల్ అయిపోతుంది. ఇప్పుడీ హీరోయిన్ రియల్ లైఫ్ లో కూడా తనకు ఆ ఇద్దరు హీరోలు వద్దంటోంది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది బేబి సినిమా. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వైష్ణవి చైతన్యను ఇంటర్వ్యూ చేసింది యాంకర్. రియల్ లైఫ్ లో ఆనంద్ దేవరకొండ లాంటి వ్యక్తి కావాలా.. విరాజ్ అశ్విన్ లాంటి అబ్బాయి కావాలా అనే ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చింది. ఇద్దర్లో ఒక్కర్ని పెళ్లాడాల్సి వస్తే, ఇద్దరూ వద్దని తేల్చేసింది వైష్ణవి చైతన్య.

ప్రస్తుతం వైష్ణవి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించింది వైష్ణవి. ఆ సినిమా అవకాశం రావడమే తన అదృష్టం అని తెలిపిన వైష్ణవి, అందులోని సన్నివేశాల్లో నటించడంపై మాట్లాడుతూ.. ఆ క్షణానికి తోచినట్టు చేశానని, అది తప్పా ఒప్పా అనే విషయం ఆలోచించలేదని చెప్పుంది. దర్శకుడికి నచ్చింది కాబట్టి తన యాక్టింగ్ బాగున్నట్టేనని తెలిపింది.

సాయిరాజేష్ దర్శకత్వంలో తెరకెక్కింది బేబి సినిమా. చిన్న బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News