Jai Balayya Song Lyrical Video: బాలయ్య పాటకు 'కాపీ' మరక

Jai Balayya Song Lyrical Video: వీర సింహారెడ్డి మూవీలోని ఓ.. ఓ..ఒసేయ్ రాములమ్మ పాటలోని ట్యూన్‌ను తమన్ కొట్టేశారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు పాటలను వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

Advertisement
Update: 2022-11-25 14:26 GMT

Jai Balayya Song Lyrical Video: బాలయ్య పాటకు 'కాపీ' మరక

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ.. వీర సింహారెడ్డి అనే ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ విడుదల చేశారు. కాగా ఆ పాట ఇలా రాగానే.. పాటను కాపీ కొట్టారంటూ విమర్శలు వచ్చాయి. గతంలో వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ పాటలు ఎంత హిట్ అయ్యాయో .. ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అయితే ఈ మూవీలోని ఓ.. ఓ..ఒసేయ్ రాములమ్మ పాటలోని ట్యూన్‌ను తమన్ కొట్టేశారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు పాటలను వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

ఇక సినిమాలకు సంబంధించిన లిరికల్ వీడియోలను విడుదల చేసి.. ప్రమోషన్ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. ప్రతి సినిమాకు ఇది మామూలే. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి చిత్రీకరణలు చేస్తున్నారు. బాలయ్య.. తమన్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో వీరసింహారెడ్డి పాటలు, బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే తమన్ మ్యూజిక్‌పై మొదటి నుంచీ కాపీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా విడుదలైన బాలయ్య సినిమాకు సంబంధించిన పాటలకు కూడా అటువంటి విమర్శలే రావడం గమనార్హం. మరోవైపు ఇవాళ విడుదలైన పాట బాలకృష్ణ ఫ్యాన్స్ ను మాత్రం మెప్పిస్తోంది. కాగా తన మీద వస్తున్న కాపీ మరకలను తమన్ ఎలా తొలగించుకుంటారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News