Ambajipeta Marriage Band | సుహాస్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Ambajipeta Marriage Band - ఈ ఏడాది ఆల్రెడీ ఓ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కొత్త ఏడాదికి మరో సినిమాతో సిద్ధమయ్యాడు నటుడు సుహాస్.

Advertisement
Update: 2023-12-26 16:48 GMT

సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరంలో సుహాస్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ఇదే. ఈ ఏడాది అతడు రైటర్ పద్మభూషణ్ తో మంచి థియేట్రికల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ థియేటర్స్ లో ఆడియెన్స్ కు యూనిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చెబుతోంది చిత్రబృందం.


ఈ సినిమాలో శివానీ నాగరం హీరోయిన్ గా నటించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. సినిమా టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Tags:    
Advertisement

Similar News