Siddardha Roi | సిద్దార్థ్ రాయ్ వస్తున్నాడు

Siddardha Roi Release Date - ట్రయిలర్ తో అందర్నీ ఆకర్షించింది సిద్దార్థ్ రాయ్ సినిమా. ఇప్పుడీ మూవీకి విడుదల తేదీ ఖరారు చేశారు.

Advertisement
Update: 2024-02-07 00:37 GMT

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ 'సిద్ధార్థ్ రాయ్' తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ‘సిద్ధార్థ్ రాయ్' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. యూనిక్ కాన్సెప్ట్, కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే వైరల్ అయి హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ట్రయిలర్ హిట్టవ్వడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై జయ అడపాక ఈ సినిమాను నిర్మించారు. సెన్సేషనల్ కంపోజర్ రధన్ సంగీతం అందించగా.. శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News