Shruti Haasan - నాని సరసన శృతిహాసన్

Shruti Haasan Nani - నాని, శృతిహాసన్ తొలిసారి కలిశారు. నాని హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది శృతిహాసన్.

Advertisement
Update: 2023-04-30 17:07 GMT

హీరో నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం షూటింగ్ స్టేజ్ లో ఉంది. కొత్త కుర్రాడు శౌర్యువ్‌ దర్శకత్వంలో శరవేగంగా షూట్ సాగుతోంది. ప్రస్తుతం గోవాలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్.

ఇప్పుడీ ప్రాజెక్టులోకి శృతి హాసన్ ఎంటరైంది. ఓ కీలక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. ప్రకటన కూడా ఇచ్చేశారు. అంతేకాదు, ఆమె గోవా షెడ్యూల్ లో కూడా జాయిన్ అయింది. ఈ ఏడాది ఆరంభంలో బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యతో అలరించింది శ్రుతి హాసన్.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఇలా స్పెషల్ రోల్స్ చేయడం శృతిహాసన్ కు కొత్త కాదు. ప్రేమమ్ సినిమా నుంచి ఆమె ఇలాంటి రోల్స్ చేస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలిసారి. ఓవైపు వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ, ఆమె ఇలా స్పెషల్ రోల్ చేయడానికి ఒప్పుకోవడం పెద్ద విషయమే. 

Tags:    
Advertisement

Similar News