Rana Naidu - రానా-వెంకీ వెబ్ సిరీస్ ట్రయిలర్ ఎలా ఉందంటే!

Rana Naidu - వెంకీ, రానా హీరోలుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. తాజాగా ఈ సిరీస్ ట్రయిలర్ రిలీజ్ అయింది.

Advertisement
Update: 2023-02-16 04:02 GMT

రానా, వెంకటేష్ కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. రానా నటించిన ఓ సినిమాలో వెంకీ ఓ స్పెషల్ సాంగ్ మాత్రం చేశాడు. ఇన్నాళ్లకు ఇద్దరూ కలిసి నటించారు. కాకపోతే అది సినిమాగా కాదు, వెబ్ సిరీస్ లో.

రానా-వెంకీ కలిసి నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ పేరు రానా నాయుడు. తాజాగా ఈ సిరీస్ ట్రయిలర్ రిలీజ్ అయింది. కథ ఏంటనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది.

రానా నాయుడులో తండ్రికొడుకులుగా నటించారు వెంకీ-రానా. ఇందులో వెంకీది రివెంజ్ తీర్చుకునే పాత్ర. ఆ రివెంజ్ దేనిపైన అనేది ట్రయిలర్ లో చెప్పలేదు. తండ్రిని అడ్డుకొని, చట్టబద్ధంగా నిలబెట్టాలనేది కొడుకు తాపత్రయం. వీళ్లిద్దరి మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే రానా నాయుడు.

వెబ్ సిరీస్ లో ఉండే ప్రధమ లక్షణమైన బోల్డ్ కంటెంట్, ఈ సిరీస్ లో కూడా ఉంది. రానాతో బోల్డ్ సీన్స్ లో నటింపజేయడమే కాకుండా.. ఫ్యామిలీ హీరో వెంకీతో కాస్త ఇబ్బందికరంగా అనిపించే డైలాగ్స్ చెప్పించారు. ఇవి కాకుండా బూతులు అదనం.

నెట్ ఫ్లిక్స్ లో వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది ఈ వెబ్ సిరీస్. దీంతో తెలుగులో పాగా వేయాలని చూస్తోంది నెట్ ఫ్లిక్స్. ఆ సంస్థ ప్రయత్నాలు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News