Balagam - బలగం వివాదంపై స్పందించిన ఆ సినిమా హీరో

Priyadarshi Balagam controversy - బలగం సినిమాలో హీరోగా నటించాడు ప్రియదర్శి. ఆ సినిమా వివాదంపై తాజాగా స్పందించాడు.

Advertisement
Update: 2023-03-13 16:40 GMT

చిన్న సినిమాగా వచ్చింది బలగం మూవీ. అయినప్పటికీ వివాదాలు తప్పలేదు. ఈ సినిమా కథ తనదే అంటూ గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు ఇప్పటికే స్పందించారు. ఇప్పుడు హీరో ప్రియదర్శి కూడా స్పందించాడు.

"నేను గ‌డ్డం సతీష్‌గారి క‌థ‌ను చ‌ద‌వ‌లేదు. అందులో పిట్ట ముట్ట‌డం అనే పాయింట్ ఉంద‌ని చూసిన వాళ్లు అంటున్నారు. కానీ ఆ మూల క‌థ‌కు మాకు సంబంధం లేదు. రెండింటినీ పోల్చి చూస్తే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. పిట్ట ముట్ట‌డం అనేది త‌ర‌త‌రాలు మ‌న ద‌గ్గరున్న అంశం. దాన్ని మూల క‌థ అని అంటే నేను ఒప్పుకోను. ఎవ‌రికీ దానిపై హక్కు లేదు."

ఇలా తొలిసారి తన సినిమా వివాదంపై స్పందించాడు ప్రియదర్శి. ప్రస్తుతం బలగం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపిన ప్రియదర్శి.. చాలామంది సినిమా చూసి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంటున్నారని తెలిపాడు.

హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ చేశాడు ప్రియదర్శి. త్వరలోనే ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు సుయోధన అనే క్రైమ్ డ్రామాలో నటిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News