Naga Chaitanya: హిట్ కాంబినేషన్ మళ్లీ కలుస్తోంది

NagaChaitanya Shiva Nirvana - దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు నాగచైతన్య. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నాడు.

Advertisement
Update: 2023-05-07 13:16 GMT

తన కొత్త సినిమా కస్టడీ ప్రచారంలో భాగంగా, మరో కొత్త సినిమా ప్రకటించాడు నాగచైతన్య. త్వరలోనే ఈ హీరో, దర్శకుడు శివ నిర్వాణతో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు.

"నా బాడీ లాంగ్వేజ్, నా మైండ్ సెట్ శివ నిర్వాణకు బాగా తెలుసు. నాకు ఓ కథ సెట్ అవుతుందని భావిస్తే, మరో హీరో దగ్గరకు వెళ్లడనే విషయం కూడా తెలుసు. ప్రస్తుతం ఓ లైన్ పై డిస్కషన్ నడుస్తోంది. పాయింట్ చాలా బాగుంది. శివ నిర్వాణతో సినిమా ఉంటుంది. త్వరలోనే వెల్లడిస్తాను."

ఇలా శివ నిర్వాణతో సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించాడు నాగచైతన్య. గతంలో వీళ్లిద్దరూ కలిసి మజిలీ అనే సినిమా చేశారు. అది పెద్ద హిట్టయింది. దీంతో వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి.

మరోవైపు తన ఫ్లాప్ మూవీ లాల్ సింగ్ చద్దాపై కూడా స్పందించాడు నాగచైతన్య. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సినిమా చేయలేదని, కేవలం అమీర్ ఖాన్ తో జర్నీ కోసమే ఆ సినిమా చేశానని అన్నాడు. 5 నెలల పాటు అమీర్ తో కలిసి సాగించిన ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అవి తన కెరీర్ కు పెట్టుబడి అని చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News