Manjummel Boys | తెలుగులోకి సూపర్ హిట్ మలయాళీ మూవీ

Manjummel Boys - ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా తెలుగులో రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకప్ తో ఇది వస్తోంది.

Advertisement
Update: 2024-03-28 01:57 GMT

2006లో జరిగిన ఒక యదార్థ ఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్' ప్రపంచ మార్కెట్‌లో 200 కోట్ల రూపాయలు ఆర్జించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

చిదంబరం పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. తమిళ్ లో ఇది పెద్ద హిట్టయింది. గడిచిన మూడేళ్లలో తమిళ్ లో హిట్టయిన తొలి మలయాళీ సినిమా ఇదే. కోలీవుడ్ నుంచి ఈ సినిమాకు 50 కోట్లు వచ్చాయి.

ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించబోతోంది 'మంజుమ్మెల్ బాయ్స్'. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడీ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగులో కూడా ఇదే టైటిల్ తో వస్తోంది. ఎందుకంటే, ఈ పేరు ఆల్రెడీ పాపులర్ అయిపోయిందిక్కడ.

Tags:    
Advertisement

Similar News