Avanthika - అమ్మకు అన్నీ తెలుసంటున్న అవంతిక

Bhagyasree Daughter Avanthika - భాగ్యశ్రీ కూతురు అవంతిక టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ, తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisement
Update: 2023-06-01 03:05 GMT

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్. ఇప్పుడీ హీరో ‘నేను స్టూడెంట్ సర్' అనే థ్రిల్లర్ మూవీతో రెడీ అవుతున్నాడు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. నటిగా ఆమెకు ఇదే కెరీర్ లో మొదటి సినిమా. మరి టాలీవుడ్ కు రావాలని అవంతిక ఎందుకు అనుకుంది? ఈ విషయంలో తల్లి భాగ్యశ్రీ ఎలాంటి సూచనలు చేసింది? వీటిపై అవంతిక స్పందించింది.

"సౌత్ ఇండస్ట్రీ అంటే అమ్మకు చాలా ఇష్టం, గౌరవం. ఆమెను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించారు. ఇక్కడ పరిశ్రమపై అమ్మకు మంచి అవగాహన ఉంది. హిందీ ఛత్రపతిలో అమ్మ పని చేశారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదించినప్పుడు.. తెలుగులో లాంచ్ కావడానికి, యంగ్ టీమ్ తో కలసి పని చేయడానికి మంచి అవకాశమనిపించింది. కథల ఎంపికలో అమ్మ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ అమ్మ సలహాలు తీసుకుంటాను. నాకు ఏం కావాలో, నాకు ఏది బావుంటుందో తనకి తెలుసు. అలా అమ్మ సూచనలు, నా అభిరుచితో నేను స్టూడెంట్ సర్ సినిమాలోకి వచ్చాను."

ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయని చెబుతోంది అవంతిక. అయితే ప్రస్తుతానికి ఏ ప్రాజెక్టుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, నేను స్టూడెంట్ సర్ రిజల్ట్ చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది.

గ్లామర్ రోల్స్ కంటే కంటెంట్ ఉన్న పాత్రలు చేయడం తనకు ఇష్టం అంటోంది అవంతిక. 10 గ్లామర్ రోల్స్ పోషించే కంటే, మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్ ఒక్కటి చేస్తే చాలని చెబుతోంది. ప్రస్తుతం తన ఆలోచనలన్నీ ఇలానే సాగుతున్నాయని, గ్లామర్ రోల్స్ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News