Pawan Kalyan in Unstoppable: పవన్‌- బాలకృష్ణ షోపై అల్లు అరవింద్ కామెంట్స్

Pawan Kalyan in Unstoppable: ఈ షో షూట్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్.. అన్‌స్టాపబుల్‌ ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో హిట్ అవుతుందని తాము ఊహించలేదన్నారు.

Advertisement
Update: 2022-12-27 05:54 GMT

Pawan Kalyan in Unstoppable: పవన్‌- బాలకృష్ణ షోపై అల్లు అరవింద్ కామెంట్స్

బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ రాబోతున్నారు. నేడు ఈ ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్‌ జరుగుతుంది. బాలకృష్ణ షోకు అనేక మంది సినిమా వాళ్లు వచ్చినా.. పవన్‌ రావడం ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే గతంలో పవన్‌ కల్యాణ్‌ను, ఆయన పార్టీని ఉద్దేశించి బాలకృష్ణ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా ఆ వ్యాఖ్యలను పలు సభల్లో ప్రస్తావించారు.

2014లో జనసేన మద్దతుతో టీడీపీ గెలిచినప్పటికీ ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను టీడీపీ నేతలు చులకనగా మాట్లాడేవారు. లేపాక్షి ఉత్సావాలకు కూడా పవన్ ను ఆహ్వానించలేదు. పైగా ఆ సమయంలో చిరంజీవిని ఆహ్వానిస్తారా అని ప్రశ్నిస్తే... అందుకు ఒక స్టేచర్‌ ఉండాలని మాట్లాడారు బాలకృష్ణ. జనసేన పార్టీని ఉద్దేశించి ఆ పార్టీలో ఉన్నదంతా అలగాజనం అంటూ బాలకృష్ణ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను పవన్ గతంలో మీటింగ్‌లో ప్రస్తావించారు కూడా.

అలాంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఒకే షోకు రావడం ఆసక్తిగా ఉంది. ఈ షో కోసం టీడీపీ నుంచి కూడా ప్రయత్నాలు జరిగినట్టు చెబుతున్నారు. బాలకృష్ణ షోకు పవన్‌ కల్యాణ్ వస్తే.. టీడీపీ- జనసేన మధ్య పొత్తుకు అది ఉపకరిస్తుందని.. రెండు పార్టీల శ్రేణుల మధ్య ఒక మంచి అనుబంధానికి బీజం వేస్తుందన్న ఉద్దేశంతోనే పవన్‌ను ఈషోకు రప్పించినట్టు చెబుతున్నారు.

ఈ షో షూట్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్.. అన్‌స్టాపబుల్‌ ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో హిట్ అవుతుందని తాము ఊహించలేదన్నారు. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ టాక్‌ షోగా అన్‌స్టాపబుల్ నిలిచిందన్నారు. పవన్‌ కల్యాణ్‌తో ఎపిసోడ్‌ మరో బిగ్గెస్ట్‌ షో అవుతుందని.. ఇలాంటి ఎపిసోడ్‌ మరొకటి రాబోదన్నారు. ఇదే క్రేజియస్ట్ ఎసిపోడ్‌ అవుతుందన్నారు. ఈ షోకు వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News