2018 Movie - విడుదలకు ముందే హిట్ టాక్

2018 Movie - మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది 2018 అనే డబ్బింగ్ సినిమా. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా తెలుగులో హిట్టయింది.

Advertisement
Update: 2023-05-25 09:24 GMT

కొన్ని సినిమాలపై అంచనాలు విడుదలకు ముందే ఉంటాయి. ఆల్రెడీ ఓ భాషలో రిలీజై, సూపర్ హిట్టయిన సినిమా అయితే, ఆ అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ మధ్య కాంతార సినిమా విషయంలో అదే జరిగింది. లవ్ టుడే విషయంలో కూడా అదే రిపీటైంది. ఇప్పుడు 2018 అనే సినిమా విషయంలో కూడా ఇదే జరగబోతోందని అంటోంది ట్రేడ్.

ఐదేళ్ల కిందట కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది 2018 సినిమా. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా కేరళలో సూపర్ హిట్టయింది. అత్యంత వేగంగా వంద కోట్లు ఆర్జించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమా తెలుగులోకి కూడా వస్తోంది. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సరికొత్త ప్లాన్ వేశారు.

సినిమా విడుదలకు ముందే మీడియాకు ప్రత్యేక షో వేశాడు ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్న బన్నీ వాస్. సినిమా చూసిన మీడియా జనాలు 2018 సినిమాను మెచ్చుకున్నారు. అంతేకాదు, చాలామంది రివ్యూలు కూడా పెట్టేశారు. 3 దాటి రేటింగ్ కూడా ఇచ్చారు.

అలా విడుదలకు ముందే 2018 సినిమా తెలుగులో హిట్ అయింది. రేపు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News