కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల రియాక్షన్.. ఏపీని అనలేదన్న రోజా.. హైదరాబాద్ లో కరెంటే లేదన్న బొత్స

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభం సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పొరుగు రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని కేటీఆర్ మాట్లాడటంపై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. “హైదరాబాద్ లో అసలు కరెంటే ఉండట్లేదు.. ఏపీలో రోడ్లు బాగాలేవని ఆయనకు వాళ్ల ఫ్రెండ్ చెప్పాడేమో.. నేనైతే హైదరాబాద్ విద్యుత్ కోతలను స్వయంగా అనుభవించాను. రోజంతా జనరేటర్ వేసుకొని […]

Advertisement
Update: 2022-04-29 09:52 GMT

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభం సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పొరుగు రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని కేటీఆర్ మాట్లాడటంపై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. “హైదరాబాద్ లో అసలు కరెంటే ఉండట్లేదు.. ఏపీలో రోడ్లు బాగాలేవని ఆయనకు వాళ్ల ఫ్రెండ్ చెప్పాడేమో.. నేనైతే హైదరాబాద్ విద్యుత్ కోతలను స్వయంగా అనుభవించాను. రోజంతా జనరేటర్ వేసుకొని ఉన్నాను“ అని మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు.

కాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేటీఆర్ తీరును తప్పుబట్టారు. ఏ విషయమైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలన్నారు. పక్కరాష్ట్రం ఏపీ గురించి మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. “రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఆస్తుల పంపకాలు కూడా పూర్తిగా జరగలేదు. మొదటి ఐదేండ్లు అసలు అభివృద్ది జరగలేదు. ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్ డెవలప్ అయ్యింది. పీవీ ఎక్స్ ప్రెస్ హైవే వైఎస్ఆర్ హయాంలో నిర్మించిందే. మొన్నటి వరకు తెలంగాణలో కూడా విద్యుత్ కోతలున్నాయి. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. నేను కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయాలని అనుకోవడం లేదు“ అని సజ్జల చెప్పారు.

ఇక ఏపీ మంత్రి రోజా శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. “మంత్రి అయ్యాక నాకు తండ్రి లాంటి కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకుందామని వచ్చాను. కేసీఆర్, ఆయన భార్య, కూతురు కవిత, కేటీఆర్ భార్య, ఎంపీ సంతోష్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. నన్ను నా కుటుంబాన్ని స్వాగతించారు“ అని రోజా చెప్పారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. తాను ఆ వీడియోను వాట్సాప్ లో చూశానని చెప్పారు. కేటీఆర్ పక్క రాష్ట్రాలు అని అన్నారు తప్ప ఏపీ గురించి మాట్లాడలేదని రోజా అభిప్రాయపడ్డారు. ఒక వేళ కేటీఆర్ ఏపీని ఉద్దేశించి అంటే మాత్రం తాను ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఏపీ పర్యాటక మంత్రిగా తాను కేటీఆర్ ను ఆహ్వానిస్తున్నాను. ఒకసారి వచ్చి రాష్ట్రంలో పరిస్థితులు పరిశీలించాల‌ని రోజా కోరారు.

Tags:    
Advertisement

Similar News